లాభాల రింగింగ్‌: 600 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌

27 May, 2022 15:37 IST|Sakshi

వారాంతంలో లాభాలు

లాభాలతో మంత్లీ ఎఫ్‌ అండ్‌ వో సిరీస్‌ షురూ

16350 కి ఎగువన ముగిసిన నిఫ్టీ

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంలోనే 500 పాయింట్లు ఎగిసినసూచీలు రోజంతా అదే ధోరణిని కంటిన్యూ చేశాయి. సెన్సెక్స్‌ 632 పాయింట్లు ఎగిసి 54885 వద్ద,   నిఫ్టీ 182 పాయిట్లు లాభంతో 16352 వద్ద స్థిరపడ్డాయి.  తద్వారా  కీలక  సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన ముగిసాయి. అలాగే మంత్‌ ఎఫ్‌ అండ్‌ వో సిరీస్‌ లాభాలతో ప్రారంభమైంది.

దాదాపు అన్ని రంగాల షేర్లు లాభలనార్జించాయి.ప్రధానంగా బ్యాంకింగ్‌ మెటల్‌ రంగ షేర్లు మార్కెట్లను ప్రభావితం చేశాయి. మరోవైపు ఆయిల్ అండ్‌ గ్యాస్  సెక్టార్‌ బలహీనంగా ముగిసింది.  రూ. 43.55 వద్ద ఎరువుల కంపెనీ  పరదీప్ ఫాస్ఫేట్స్  షేరు బీఎస్‌ఈలో శుక్రవారం మంచి మార్కెట్‌లోకి ప్రవేశించింది, ఇష్యూ ధర రూ. 42 కంటే 4 శాతం ప్రీమియం లిస్టింగ్ తర్వాత, స్టాక్ 13 శాతం పెరిగి రూ.47.25కి చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈలో అపోలోహాస్పిటల్‌, టెక్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌, హీరో మోటో, బజాజ్‌ పైనాన్స్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ లాభపడ్డాయి. అటు ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, భారతి  ఎయిర్‌టె్‌, పవర్‌ గ్రిడ్‌, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌, బజాజ్‌ఆటో నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. 

మరోవైపు డాలరుమారకంలో 2 పైసలు లాభపడిన రూపాయి 77.59 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు