రెండో రోజు లాభాల జోరు, 15,700 ఎగువకు నిఫ్టీ

24 Jun, 2022 09:57 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీలాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఆరంభంలో 600 పాయింట్ల దాకా  ఎగిసిన ప్రస్తుతం సెన్సెక్స్‌ 501 పాయింట్లు  లాభంతో 52767 వద్ద, నిఫ్టీ 148  పాయింట్లు లాభంతో 15705 వద్ద కొనసాగుతున్నాయి.  అన్ని రంగాల షేర్లు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి.   ఫలితంగా సెన్సెక్స్‌ 53 వేలకు చేరువలో ఉండగా,నిఫ్టీ 15700ఎగువకు చేరింది. 

ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, హీరో మోటో, ఐషర్‌ మోటార్స్‌,  బ్రిటానియా, హెచ్‌యూఎల్‌ లాభాల్లో ఉన్నాయి.  మరోవైపు  ఏసియన్‌ పెయింట్స్‌ టెక్‌ మహీంద్ర,  ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌,  కోల్‌ ఇండియా నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.  అటు దేశీయ మార్కెట్ల దన్నుతో కరెన్సీ రూపాయి కూడా పాజిటివ్‌గా ఉంది.  గురువారం నాటి క్లోజింగ్‌ 78.30 తో పోలిస్తే డాలరుమారకంలో 12  పైసలు లాభంతో 78.20 వద్ద కొనసాగుతుంది. 

మరిన్ని వార్తలు