స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

17 Jan, 2022 16:18 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఊగిసలాట దొరణి కనబరిచి చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. కార్పొరేట్ సంస్థల ఆశాజనక క్యూ3 ఫలితాలు మదపర్లపై సానుకూల ప్రభావం చూపాయి. బాండ్లపై రాబడి పెరగడం వంటి కారణాల వల్ల మార్కెట్లు మధ్యాహ్నం సెషన్​ వరకు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత ఆటో, రియాల్టీ, పవర్ పేర్ల మద్దతుతో చివరకు సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి.

ముగింపులో, సెన్సెక్స్ 85 పాయింట్ల(0.14%) లాభంతో 61,308వద్ద ముగిసింది. నిఫ్టీ 52 పాయింట్లు (0.29%) వృద్ధి చెంది 18,308 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.23 వద్ద ఉంది. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, గ్రాసీమ్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్లుగా నిలిస్తే.. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఆటో, పవర్, రియాల్టీ సూచీలు 1-2 శాతంతో లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఎక్కువగా ముగిశాయి.

(చదవండి: Republic Day Sale: ఈ ఆఫర్లు అస్సలు మిస్‌ చేసుకోవద్దు!)


 

మరిన్ని వార్తలు