వ్యాక్సిన్‌ జోష్‌ : 50 వేల దిశగా సెన్సెక్స్‌ దౌడు

13 Jan, 2021 09:54 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ మార్కెట్టు బుధవారం కూడా పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి.  దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో కీలక సూచీలు రెండూ సరికొత్త రికార్డులను నమోదు  చేస్తూ దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్‌ 256  పాయింట్లు  ఎగిసి 48773 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు 14647 వద్ద  ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 50 వేల వైపు  పరుగులు పెడుతోంది.  నిఫ్టీ 14600 ఎగువన స్థిరంగా  కొనసాగుతుండగా, బ్యాంకు నిఫ్టీ సరికొత్త ఆల్‌ టైం హైని టచ్‌ చేసింది.  ప్రధానంగా కరోనా అంతానికి దేశంలో రెండు వ్యాక్సిన్ల్లు అందుబాటులోకి రావడం,   మరి రెండు రోజుల్లో  వ్యాక్సినేషన్‌ మెగా  డ్రైవ్‌ షురూ కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ పాజిటివ్‌గా ఉంది. దీంతో ఆసియా అంతటా మార్కెట్లు   మిశ్రమంగా ఉన్నప్పటికీ  మన సూచీలు లాభాలతో కళకళలాడుతున్నాయి. వ్యాక్సిన్‌ డోస్‌లు పలు నగరాలకు చేరడంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆశలు పుంజుకున్నాయి.  (కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ ధర : సీరం కీలక ప్రకటన)

మరిన్ని వార్తలు