StockMarketOpening: లాభాల రింగింగ్‌, అదానీ జూమ్‌

2 Sep, 2022 09:51 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల మధ్య శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. గురువారం నాటి భారీ నష్టాలనుంచి  తెప్పరిల్లిన సెన్సెక్స్‌ 100 పాయింట్లు  ఎగిసింది. నిఫ్టీ  కూడా 17,550 ఎగువకు చేరింది. ప్రస్తుతం  61 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌, నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి  కొనసాగుతున్నాయి.

అన్ని రంగాలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.  ప్రధానంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ.3,290కి  స్థాయిని తాకింది.అలాగే ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం తన గ్రీన్ యూనిట్ కోసం మైనారిటీ వాటా విక్రయానికి బిడ్లను స్వీకరించిన తర్వాత ఎన్టీపీసీ షేర్లు 3 శాతం పెరిగాయి. ఇంకా బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ బ్యాంక్  లాభాల్లోనూ, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ  నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో 13పైసలు కోల్పోయిన రూపాయి 79.65 వద్ద ఉంది. 

మరిన్ని వార్తలు