StockMarketUpdate: నష్టాలకు చెక్‌, లాభాల్లో సూచీలు

22 Nov, 2022 10:33 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.  ఆసియా షేర్లు వెనుకంజలో ఉన్నప్పటికీ మంగళవారం కీలక సూచీలు లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్‌ 170 పాయింట్లు  ఎగిసి 61315 వద్ద, నిఫ్టీ   55 పాయింట్లు లాభంతో 18214 వద్ద కొనసాగుతున్నాయి.  దాదాపు అన్ని రంగాల షేర్లు పాజిటివ్‌గానే  ఉన్నాయి. 


అల్ట్రాటెక్ సిమెంట్‌,  గ్రాసిం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు,హిందాల్కో, డా. రెడ్డీస్‌ భారీగా లాభపడుతుండగా, పవర్‌ గగ్రిడ్‌, ఓఎన్జీసీ, నెస్లే, బీపీసీఎల్‌, కోటక్‌ మహీంద్ర టాప్‌ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.  అటు డాలరు మారకంలో రూపాయి 10పైసలు ఎగిసి, 81.75 వద్ద ఉంది

మరిన్ని వార్తలు