బుల్‌ దౌడు : నింగిని తాకుతున్న సూచీలు

9 Feb, 2021 11:29 IST|Sakshi

స్టాక్‌మార్కెట్లో బుల్‌ ర్యాలీ

 వరుసగా ఏడోరోజూ భారీ లాభాలు

 సరికొత్త గరిష్టానికి సెన్సెక్స్‌,నిఫ్టీ

సాక్షి, ముంబై:   దేశీయ స్టాక్‌మార్కెట్ల బుల్‌ ర్యాలీ అప్రతిహతంగా  కొనసాగుతోంది.  వరుసగా ఏడోరోజూ దేశీయ మార్కెట్లు   మంగళవారం సరికొత్త  రికార్డు స్థాయిలనునమోదు చేశాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరిన సూచీలు అప్‌ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 348 పాయింట్ల లాభంతో 51693 వద్ద, నిఫ్టీ 116 పాయింట్ల లాభంతో 15229 ఎగువన ట్రేడవుతోన్నాయి.  బ్యాంక్‌ షేర్ల లాభాలతో  బ్యాంక్‌ నిఫ్టీ కూడా  లాభాల్లో ట్రేడవుతోంది.యూపీఎల్‌,  విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌,  బీపీసీఎల్‌, టైటాన్‌ లాభాల్లో ఉండగా, ఐఓసీ, టాటా మోటార్స్‌ , ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌ నష్టపోతున్నాయి. 

మరోవైపు చమురు ధరలు మంగళవారం 13 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో బీపీసీఎల్‌  లాంటి ఆయిల్‌ రంగ షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. కరోనా మహమ్మారి సంక్షోభం నుండి వేగంగా ఆర్థికంగా కోలుకునే అశావాదం మధ్య పెట్టుబడిదారుల  పాజిటివ్‌ సెంటిమెంట్‌తో వాల్ స్ట్రీట్ సోమవారం ఆల్-టైమ్ క్లోజింగ్ హై స్థాయికి చేరుకుంది. దీంతో మన మార్కెట్లు కూడా లాభాల  దౌడుతీస్తున్నాయి.

మరిన్ని వార్తలు