షేర్‌ మార్కెట్‌.. సెన్సెక్స్‌ ఆల్‌టైం రికార్డు

22 Jun, 2021 11:42 IST|Sakshi

ముంబై: దేశీయ మార్కెట్ల సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 53 వేల మార్క్‌ దాటి ఆల్‌ టైం రికార్డు నమోదు చేసింది. సెన్సెక్స్‌ 53వేల మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి. ఇక నిఫ్టీ 16వేల మార్క్‌కు చేరువలో ఉంది.  ఈరోజు ఉదయం 10గంటల ప్రాంతానికి సెన్సెక్స్‌ 428. 65 పాయింట్లు ఎగబాకి ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. ఇక నిఫ్టీ 50 పాయింట్లతో  15,880 పాయింట్లతో కొనసాగుతోంది. 

ప్రధానంగా మారుతి సుజుకీ, ఎల్‌ అండ్‌ టీ, టీసీఎస్‌, భారతిటెల్‌, ఓఎన్‌జీసీల షేర్లు లాభాల పట్టడంతో సెన్సెక్స్‌ ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. సోమవారంం దేశీయ సూచీలు తొలుత కాస్త ఆటుపోట్లకు గురైనప్పటికీ ఆపై పుంజుకున్నాయి. చివరకు సెన్సెక్స్‌  230 పాయింట్ల లాభంతో 52,574 వద్ద స్థిరపడగా, నిఫ్టీ సూచీ 177 పాయింట్ల నష్టం నుంచి కోలుకుని 63 పాయింట్లు పెరిగి 15,747 వద్ద నిలిచింది.  ఐటీ, ఆటో మినహా అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి.

సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా దాదాపు 80.30 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశారనే వార్తతో మార్కెట్‌లో సానుకూల వాతావరణం ఏర్పడింది. దీనికి తోడు చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ నిబంధనలు క్రమంగా సడలిస్తున్నాయి. ఫలితంగా మార్కెట్‌లో జోష్‌ కనిపించింది. 

ఇక్కడ చదవండి: బుల్స్‌ బౌన్స్‌బ్యాక్‌

మరిన్ని వార్తలు