భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

24 Feb, 2021 18:58 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. సాంకేతిక లోపాల కారణంగా స్టాక్‌ మార్కెట్లో(ఎన్‌ఎస్‌ఈ) ట్రేడింగ్‌ నిలిచిపోయింది. ఎన్‌ఎస్‌ఈ ఎఫ్‌అండ్‌ఓలో ఉదయం 11:40 నిమిషాల నుంచి ట్రేడింగ్‌ ఆగిపోయింది. దీంతో ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించాలని నిర్ణయించారు. సాయంత్రం 3:45 గంటలకు సెన్సెక్స్‌, నిప్టీ ట్రేడింగ్‌ను పునఃప్రారంభించాయి. తర్వాత సూచీలు భారీ లాభాల దిశగా దూసుకెళ్లాయి. సెన్సెక్స్‌ 50,881-49,648 మధ్య కదలాడింది. నిఫ్టీ 14,723 వద్ద కనిష్ఠాన్ని, 15,008 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో సెన్సెక్స్‌ 50 వేలు, నిఫ్టీ 15,000 పాయింట్ల కీలక మైలురాయిని మరోసారి తాకాయి. చివరకు సెన్సెక్స్‌ 1,030 పాయింట్ల లాభంతో 50,781 వద్ద ముగిసింది. నిఫ్టీ 279 పాయింట్లు పైకి ఎగసి 14,987 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.36 వద్ద నిలిచింది. 

చదవండి:

ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఏడు స్క్రీన్‌ల ల్యాప్‌టాప్‌ను చూశారా!

మరిన్ని వార్తలు