StockMarketingOpening: జోరుగా..హుషారుగా, 61వేలను దాటేసిన సెన్సెక్స్‌

1 Nov, 2022 09:48 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైనాయి.   ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఆరంభంలోనే సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా  ఎగిసింది. ఫలితంగా సెన్సెక్స్‌ 61వే స్థాయిని  నిఫ్టీ 18వేల మార్క్‌ను సునాయాసంగా అధిగమించాయి.  

మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు 0.3 శాతం వరకు పెరిగాయి. మెటల్  మినహా, అన్ని రంగాలు, ప్రధానంగా బ్యాంక్, ఫార్మా రంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 3 80పాయింట్లు  ఎగిసి 61126 వద్ద,నిఫ్టీ 118 పాయింట్ల లాభంతో 18130వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.

డా.రెడ్డీస్‌, అపోలో హాస్పిటల్స్‌, దివీస్‌  లేబ్స్‌, గ్రాసిం ఐసీఐసీఐ బ్యాంకు లాభాల్లో ఉండగా, యాక్సిస్‌, టాటా స్టీల్‌, భారతి ఎయిర్‌టెల్‌, కోల్‌ ఇండియా , ఐటీసీ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయిల 82.75 వద్ద ఫ్లాట్‌గా ఉంది. 

మరిన్ని వార్తలు