ఆటో, ఐటీ దన్ను- మార్కెట్లు జూమ్‌

28 Jul, 2020 13:29 IST|Sakshi

412 పాయింట్ల హైజంప్‌

38,347కు సెన్సెక్స్‌

121 పాయింట్లు ఎగసిన నిఫ్టీ

ప్రపంచ మార్కెట్ల ప్రోద్బలంతో సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 412 పాయింట్లు జంప్‌చేసి 38,347ను తాకగా.. నిఫ్టీ 121 పాయింట్లు ఎగసి 11,253 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా ఎన్‌ఎస్‌ఈలో ఆటో ఇండెక్స్‌ 2.6 శాతం ఎగసింది. ఈ బాటలో ఐటీ, మెటల్‌, రియల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 1.5-0.5 శాతం మధ్య బలపడ్డాయి. మీడియా 1.2 శాతం, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.35 శాతం చొప్పున నీరసించాయి.

బ్లూచిప్స్‌ తీరిలా
నిఫ్టీ దిగ్గజాలలో హీరో మోటో, టీసీఎస్‌, ఇండస్‌ఇండ్, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఆటో, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, మారుతీ, టెక్‌ మహీంద్రా, హిందాల్కో 4-3 శాతం మధ్య ఎగశాయి. అయితే టీ, ఐసీఐసీఐ, ఇన్‌ఫ్రాటెల్‌, ఓఎన్‌జీసీ, నెస్లే, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, యూపీఎల్‌ 2.6-0.5 శాతం మధ్య క్షీణించాయి.

జీఎంఆర్‌ అప్‌
డెరివేటివ్స్‌లో జీఎంఆర్, అపోలో హాస్పిటల్స్‌, మారికో, ఎస్కార్ట్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, సెయిల్‌, ఉజ్జీవన్‌, అదానీ ఎంటర్‌ 6-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. హావెల్స్‌, బీఈఎల్‌, ఐడియా, మెక్‌డోవెల్‌, పెట్రోనెట్‌, వోల్టాస్‌ 3-2 శాతం మధ్య నష్టపోయాయి.

మరిన్ని వార్తలు