క్రిప్టో టాక్స్‌ మినహాయింపు అంచనాలు: సెన్సెక్స్‌ జంప్‌

2 Jun, 2022 15:38 IST|Sakshi

 క్రిప్టో కరెన్సీ టాక్సేషన్‌ మినహాయింపు వార్తలు, మార్కెట్‌కు ఊతం

55750  ఎగువకు సె న్సెక్స్‌ 

16600 స్థాయిని నిలుపుకున్న  నిఫ్టీ

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాలనుంచి కోలుకుని భారీ లాభాలతో ముగిసాయి.  ట్రేడింగ్‌ ఆరంభంలో వరుసగా  మూడో  రోజు  కూడా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు మిడ్‌ సెషన్‌ నుంచి బాగా కోలుకున్నాయి. కొనుగోళ్లు పుంజుకోవడంతో సెన్సెక్స్‌ 500 పాయింట్లకుపైగా ఎగిసింది. చివరికి సెన్సెక్స్‌437 పాయింట్ల లాభంతో 55818 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు ఎగిసి 16628 వద్ద స్థిరపడ్డాయి.

బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించే ఆసుపత్రులు, బ్యాంకు డిజిటల్ కార్డ్‌లపై రివార్డ్ పాయింట్లు, ఫ్లైట్ మైల్స్‌కు కేంద్రం క్రిప్టో టాక్స్‌ నుంచి 30 శాతం ఉప శమనం ఇవ్వనుందట. ఈ రిలాక్సేషన్‌పై  ఆర్థికమంత్రిత్వ శాఖ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఒక నోటిఫికేషన్‌ జారీ చేయనుందన్న  అంచనాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి.

ఐటీ, ప్రభుత్వ బ్యాంకులు సహా దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ బయ్యింగ్‌ సపోర్ట్‌ కనిపించింది. ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.  ముఖ్యంగా ఐటీ షేర్లు బాగా రీబౌండ్‌ అయ్యాయి.  రిలయన్స్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాన్‌ ఫిన్‌ సర్వ్‌, ఇన్ఫోసిస్‌,  టాప్‌ గెయినర్స్‌గా  నిలిచాయి.  మరోవైపు అపోలో హాస్పిటల్స్‌, హీరో మోటోకార్ప్‌ , హెచ్‌డీఎఫ్‌సీ, ఐషర్‌ మోటార్స్‌, టాటా మోటార్స్‌ భారీ నష్టాలను చవి చూశాయి. డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 77.59 వద్ద స్వల్ప లాభాల్లో స్థిరపడింది. 

మరిన్ని వార్తలు