కొనుగోళ్ల జోరు:సెన్సెక్స్‌ 500 పాయింట్లు జంప్‌

21 Jun, 2022 09:53 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.  ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా ఎగిసిన  ఆ తరువాత సెన్సెక్స్‌‌ 338 పాయింట్ల లాభంతో  52115 వద్ద, నిఫ్టీ 159 పాయింట్ల లాబంతో 15506 వద్ద ట్రేడ్‌ అవుతోంది.   ఒక్క ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్‌ మినహా అన్ని రంగాల షేర్లలోనే  కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.  దీంతో  సెన్సెక్స్‌ 52 వేలను, నిఫ్టీ 15500స్థాయిని అధిగమించడం ఉండటం  విశేషం.

టైటన్‌, టాటా మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, డా. రెడ్డీస్‌, హిందాల్కో లాభపడుతున్నాయి. మరో వైపు బీపీసీఎల్‌ రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌ మాత్రమే నష్టపోతున్నాయి.  అటు  దేశీయ కరెన్సీ  రూపాయి గత ముగింపు 77.98తో పోలిస్తే డాలర్‌కు 77.97 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది.

మరిన్ని వార్తలు