మార్కెట్ జంప్ : సెన్సెక్స్ @38000

5 Aug, 2020 09:32 IST|Sakshi

లాభాల జోరు

38 వేల ఎగువకు సెన్సెక్స్

11200 స్థాయికి నిఫ్టీ

సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్  భారీ లాభాలతో ప్రారంభమైంది.  దాదాపు అన్ని రంగాల షేర్లలోను కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.   దీంతో సెన్సెక్స్ 370 పాయింట్లు ఎగిసి తిరిగి 38 వేల స్థాయికి చేరింది.  నిఫ్టీ 105 పాయింట్ల లాభంతో 11200 స్థాయికి తాకింది.

ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, ఫార్మ రంగ సెక్టార్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ , మారుతి, హిందాల్కో, ఇండస్ ఇండ్, యాక్సిస్, టాటా మోటార్స్, టాటా స్టీల్ భారీగా లాభపడుతున్నాయి. అటు హెవీవెయిట్  ఇండెక్స్ రిలయన్స్ రికార్డు స్థాయికి చేరువలో టాప్ విన్నర్ గా  ట్రేడ్ అవుతోంది. అలాగే 35 రూపాయల వద్ద కోవిడ్ డ్రగ్ ఫావిపిరవర్ టాబ్లెట్ విడుదల చేసిన నేపథ్యంలో సన్ ఫార్మా 5 శాతం ఎగిసింది. మరోవైపు హెచ్ సీఎల్ టెక్, నెస్లే ఇండియా నష్టపోతున్నాయి. 

>
మరిన్ని వార్తలు