సాక్షి మనీ మంత్ర : భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

13 Feb, 2024 15:38 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లకు జాతీయ, అంతర్జాతీయ అంశాలు కలిసొచ్చాయి. ప్రధానంగా అమెరికా ద్రవ్యోల్బణ డేటా విడుదల నేపథ్యంలో మదుపర్లు ఆసియా మార్కెట్‌లలో మదుపు చేసేందుకు మొగ్గు చూపారు. ఫలితంగా మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికి.. మార్కెట్లు ముగిసే సమయానికి పుంజుకున్నాయి. 

మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 482 పాయింట్ల లాభంతో 71555 వద్ద, నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో 21743 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. 

ఇక, కోల్‌ ఇండియా, యూపీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో షేర్లు లాభాల్లో ముగియగా.. హిందాల్కో, గ్రాసిమ్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, దివిస్‌ ల్యాబ్స్‌, బీపీసీఎల్‌, ఎం అండ్‌ ఎం, టైటాన్‌ కంపెనీ, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega