మెటల్‌ షాక్‌: నష్టాల్లోకి  స్టాక్‌మార్కెట్లు

24 May, 2022 09:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశీయ  స్టాక్‌ మార్కెట్లు  నష్టాలతో  ట్రేడ్‌ అవుతున్నాయి.  సెన్సెక్స్‌ 114పాయింట్ల నష్టంతో  54173వద్ద నిఫ్టీ 46 పాయింట్ల  నష్టంతో 16169 వద్ద ట్రేడింగ్‌ను కొన సాగిస్తున్నాయి. మెటల్ స్టాక్స్ రికవరీతో ఓపెనింగ్‌లో మంగళవారం ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఉక్కు తయారీ ముడిసరుకులపై కేంద్రం ఎగుమతి సుంకాలను విధించడంతో గత సెషన్‌లో మెటల్ షేర్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే.

1.56 శాతం  లాభంతో   M&M టాప్ గెయినర్‌గా ట్రేడ్‌ అవుతోంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు హిందుస్థాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

మరిన్ని వార్తలు