అమ్మకాల సెగ : మూడురోజుల లాభాలకు బ్రేక్‌

4 Mar, 2021 12:04 IST|Sakshi

సాక్షి, ముంబై: వరుస మూడురోజుల లాభాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు  గురువారం భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో ఆరంభ నష్టాలనుంచి మరింత దిగజారి  700 పాయింట్లకు పైగా  పతనాన్ని నమోదు   చేసింది.  భారీ నష్టాలనుంచి తెప్పరిల్లినప్పటికీ మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లలలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

సెన్సె‍క్స్‌ ప్రస్తుతం 400 పాయింట్ల నష్టంతో 51045 వద్ద నిఫ్టీ 107  పాయింట్లు నీరసించి 15139 వద్ద కొనసాగుతున్నాయి.  ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ  సూచీలను ప్రభావితం చేస్తోంది. బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్,  ఇండస్ ఇండ్ బ్యాంక్ నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు