stock market : రికార్డు క్లోజింగ్‌ 

11 Jun, 2021 16:27 IST|Sakshi

 52,641 వద్ద సెన్సెక్స్‌ ఆల్‌టైం హై

నిఫ్టీ 15,835 వద్ద జీవితకాల గరిష్ట స్థాయికి

రికార్డు ముగింపు

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో పటిష్టంగా ముగిసాయి. గ్లోబల్ మార్కెట్ల ర్యాలీ, వరుసగా నాలుగవ రోజు లక్ష కన్నా తక్కువ రోజువారీ కరోనావైరస్ కేసుల నమోదు దేశంలో రుతుపవనాల ప్రారంభం  ఇన్వెస్టర్లసెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఫలితంగా కీలక సూచీలు రికార్డు స్థాయిని నమోదు చేశాయి. సెన్సెక్స్ 341 పాయింట్లు జూమ్ చేసి 52,641 వద్ద, నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 15,835 జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. అయితే వారం ముగింపులో  ట్రేడర్ల లాభాల స్వీకరణతో సెన్సెక్స్‌ 174 పాయింట్లు, నిఫ్టీ  62 పాయింట్ల మేర లాభపడింది. 52,474 వద్ద  సెన్సెక్స్‌, 15,799.35 రికార్డు స్థాయిలో ముగిసింది.  దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి.  ప్రధానంగా ఐటీ,  మెటల్ షేర్ల లాభాలు భారీ మద్దతునిచ్చాయి. రియాల్టీ,  మీడియా, బ్యాంక్ సూచీలు నష్టపోయాయి. 

టాటా స్టీల్ నిఫ్టీ లాభంలో అగ్రస్థానంలో నిలిచింది. జెఎస్‌డబ్ల్యు స్టీల్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిండాల్కో, పవర్ గ్రిడ్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, డివిస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, లార్సెన్  అండ్టూ‌ బ్రో, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సి లైఫ్, ఎస్‌బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టపోయాయి. 

చదవండి : ఇన్వెస్టర్ల సంపద రికార్డు: సెన్సెక్స్‌ నెక్ట్స్‌ టార్గెట్‌
Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ!

మరిన్ని వార్తలు