stockmarket: రికార్డు క్లోజింగ్‌

15 Jun, 2021 16:40 IST|Sakshi

తగ్గుతున్న కరోనా కేసులు, ఆంక్షల సడలింపు

ఇన్వెస్టర్లలోఆశలు, కొనుగోళ్లు

బ్యాంకింగ్‌ జోరు

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి లాభాలతో కళకళలాడిన సూచీలు రోజంతా అదే ధోరణిని కంటిన్యూ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లులాభాల్లో ముగిసాయి. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడం, లాక్‌డౌన్‌ ఆంక్షల సడింపుతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 222 పాయింట్లుఎగిసి 52773 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 15869 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా కీలకసూచీలు రెండూ మరో రికార్డ్‌ క్లోజింగ్‌ను నమోదు చేశాయి. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసిజి, మీడియా రియాల్టీ షేర్లు లాభపడగా,  మెటల్‌, ఫార్మా నష్టపోయాయి. 

3 శాతం ఎగిసి ఏషియన్ పెయింట్స్  టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇంకా హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎస్‌బిఐ లైఫ్, ఇండియన్ ఆయిల్, యుపిఎల్, ఇన్ఫోసిస్, ఒఎన్‌జిసి లాభాల్లో ముగిసాయి. మరోవైపు దివిస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హిండాల్కో, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, సిప్లా, టైటాన్ నష్టపోయాయి. 

చదవండి:  Covaxin ఇంతకంటే ధర తగ్గించలేం: భారత్‌ బయోటెక్‌
దేవుడు చాలా కఠినాత్ముడు: మేఘనా రాజ్‌ ఎమోషన్‌

మరిన్ని వార్తలు