StockMarketClosing నష్టాలకు చెక్‌: వారాంతంలో లాభాల జోష్‌

4 Nov, 2022 15:35 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో లాభాలతో పటిష్టంగా ముగిసాయి. ఫెడ్‌ ఎఫెక్ట్‌తో గత రెండు రోజులుగా ఊగిసలాడుతున్నప్పటికీ కీలక మద్దతు స్థాయిలకు ఎగువన స్థిరంగా ఉంటున్నాయి. శుక్రవారం  లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించిన  రోజంతా ఒడిడుదడుకుల మధ్య సాగాయి. అన్ని రంగాలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. మెటల్ ఇండెక్స్ అత్యధికంగా లాభపడగా, హెల్త్‌కేర్ ఇండెక్స్ అత్యధికంగా క్షీణించింది.

 చివరికి114 పాయింట్ల లాభంతో 60950 వద్ద సెన్సెక్స్‌, 64 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ 18117 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 18100 ఎగువన  స్థిరపడటం విశేషం. 

ఫలితాల జోష్‌తో అదానీ ఎంటర్‌పప్రైజెస్‌ టాప్‌ విన్నర్‌గా ఉంది. ఇంకా హిందాల్కో, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, అదానీ పోరర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యు స్టీల్‌  లాభపడ్డాయి. అటు హీరొ మోటో కార్ప్‌,సిప్లా, డా రెడ్డీస్‌, బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ నష్టపోయాయి. డాలరు మారకంలో  రూపాయి భారీగా ఎగిసింది. ఏకంగా 48 పైసలు లాబడా 82.49 వద్ద స్థిరపడింది. 

మరిన్ని వార్తలు