ఆరో రోజూ అదే కథ: ఐటీ ఢమాల్‌

17 Jun, 2022 15:48 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో  సరిపెట్టుకున్నాయి. గత ఐదు సెషన్లుగా భారీగా నష్టపోతున్న సూచీలు 6వ సెషన్‌, వారాంతంలో స్వల్ప నష్టాలతో ముగిసాయి. ఆరంభంలోనే  కుప్పకూలిన సెన్సెక్స్‌ ఆ తరువాత భారీగా కోలుకుంది. ఐటీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్‌ గ్యాస్  నష్టపోగా, మెటల్  బ్యాంకింగ్ పేర్లలో  కొనుగోళ్ల ధోరణి  కనిపించింది. చివరికి సెన్సెక్స్‌ 135 పాయింట్ల నష్టంతో 51, 360 వద్ద, నిఫ్టీ 67  పాయింట్ల నష్టపోయి 15693 వద్ద స్థిరపడ్డాయి. 

టైటన్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది. విప్రో, టీసీఎస్‌, టెక్ మహీంద్రా, బీపీసీఎల్‌, శ్రీసిమెంట్స్‌, ఏషియన్ పెయింట్స్,  డా.రెడ్డి ల్యాబ్స్‌ సన్ ఫార్మా షేర్లు భారీగా నష్టపోయాయి. మరోవైపు బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీల్,హెచ్‌డీఎఫ్‌సీబ్యాంకు, ఐటీసీ లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు