ఫార్మా జోరు, లాభాల్లో స్టాక్‌మార్కెట్‌

10 Jun, 2021 10:22 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో  ప్రారంభమైనాయి. అంత్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలున్నప్పటికీ  సెన్సెక్స్‌  200 పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ 15700 ఎగువకు చేరింది. కానీ తరువాత కాస్త వెనుకంజ వేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 150 పాయింట్లు ఎగిసి 52086 వద్ద, నిఫ్టీ  53 పాయింట్ల లాభంతో 15692 వద్ద కొనసాగుతోంది. ఫార్మా, మెటల్‌ , ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌, పవర్, రియాల్టీ,  షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, శ్రీ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, విప్రో, సిప్లా, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్ మరియు గ్రాసిం షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటితోపాటు పైజర్‌ అలెంబిక్‌ఫార్మా, అరబిందో ఫార్మా, లుపిన్‌; దివీస్‌, గ్లెన్‌మార్క్‌, బయెకాన్‌, టొరంటో ఫార్మా, క్యాడిల్లీహెల్త్‌ తదితర ఫార్మా రంగ షేర్ల లాభాలు మార్కెట్‌కు బలాన్నిస్తున్నాయి.  మరోవైపు ఐటీసీ, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు