లాభాల స్వీకరణ: బుల్‌ రన్‌కు బ్రేక్

4 Feb, 2021 10:34 IST|Sakshi

సాక్షి, ముంబై: అత్యధిక రికార్డు స్థాయిలనుంచి దేశీయ స్టాక్‌ మార్కెట్లు దిద్దుబాటుకు గురవుతున్నాయి. మూడు రోజుల భారీ లాభాల అనంతరం మదు పరుల లాభాల స్వీకరణ సర్వ సాధారణం. ఈ నేపథ్యంలో  కీలక సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ నష్టాలతో కొనసాగుతున‍్నప్పటికీ 50వేలకు ఎగువన సెన్సెక్స్‌, నిఫ్టీ 14700కు పైన స్థిరంగా ట్రేడ్‌ అవుతుండటం గమనార‍్హం. 50వేల మద్దతు స్థాయికి పైన ఉన్నంతవరకు ఆందోళన అవసరం లేదని విశ్లేషకుల అంచనా. అయితే ఈ స్థాయిల్లో అప్రమత్తత అవసరమని  సూచిస్తునన్నారు. 

సెన్సెక్స్ 200 పాయింట్లు తగ్గి 50040 వద్ద,  నిఫ్టీ 51 పయింట్ల నష్టంతో 14750 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, ఐటీ,  పీఎస్‌యు బ్యాంక్ సూచికల్లో అమ్మకాల ధోరణి కనిపిస్తోంది. మరోవైపు, ఆటో, ఎఫ్‌ఎంసిజి, మెటల్, మీడియా షేర్లు  పాజిటివ్‌గా  ట్రేడ్‌ అవుతున్నాయి  ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, టాటామోటార్స్ ఏషియన్ పెయింట్స్ తదితరాలు నష్టాల్లోనూ, మహీంద్రా అండ్ మహీంద్రా,  ఓఎన్‌జిసి, బజాజ్ ఆటో లాభాల్లోను ఉన్నాయి. మెరుగైన ఫలితాలనుప్రకటించినభారతి ఎయిర్‌టెల్‌ లాభాల జోరు కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు