stockmarket: లాభాల స్వీకరణ, ఐటీసీ ఢమాల్‌

2 Jun, 2021 10:02 IST|Sakshi

కొనసాగుతున్న ప్రాఫిట్‌ బుకింగ్‌

 ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశాలు

300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కీలక  సూచీలు మంగళవారం నాటి బలహీనతను కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్‌ 226 పాయింట్లు పతనమై 51704 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించి 15524 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

 ప్రధానంగా మార్చి క్వార్టర్‌ ఫలితాల నేపథ్యంలో ఐటీసీ కుప్పకూలింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభాలు 1.3 శాతం క్షీణంచాయి.  మార్చి 2021 తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 3,748 కోట్ల రూపాయలుగా నమోదైంది..దీంతో ఐటీసీ షేరు 3 శాతం నష్టపోయింది. ఇంకా ఎంఅండ్‌ఎం, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, టిసిఎస్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్ నష్టపోతున్నాయి. అదానీ పోర్ట్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, కోల్ ఇండియా, సిప్లా, శ్రీ సిమెంట్స్, టాటా స్టీల్, డివిస్ ల్యాబ్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్, ఎస్‌బిఐ లైఫ్ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నేడు ప్రారంభం కానుంది. సమావేశ నిర్ణయాలను ఆర్‌బీఐ  శుక్రవారం వెల్లడించనుంది. 

చదవండి : నిఫ్టీ రికార్డు ర్యాలీకి విరామం
భారీగా తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్‌ ధర

మరిన్ని వార్తలు