Stockmarket: ఫ్లాట్‌గా సూచీలు, మెటల్‌ డౌన్‌

16 Jun, 2021 10:05 IST|Sakshi

అమ్మకాల ఒత్తిడి,  నష్టాల్లో సూచీలు

15850 దిగువకు నిఫ్టీ

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఆరంభంలో పాజిటివ్‌గా ఉన్నప్పటికీ గ్లోబల్‌ సంకేతాలతో వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ నిర్ణయం కోసం అమెరికా  ఇన్వెస్టర్లు  వేచి చూస్తున్నారు. సెన్సెక్స్ 165 పాయింట్ల వరకు క్షీణించింది. నిఫ్టీ 50 ఇండెక్స్  ప్రధాన మద్దతు స్థాయి 15,850 దిగువకు పడిపోయింది. కానీ వెంటనే తేరుకుని ప్రస్తుతం15 పాయింట్ల నష్టానికి పరిమితమై 15852 వద్ద,  సెన్సెక్స్‌ 38 పాయింట్లు నష్టంతో 52736 వద్ద ట్రేడ్‌ అవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలనెదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మెటల్‌ సెక్టార్‌ భారీగానష్టపోతోంది. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ పోరర్ట్స్‌, పవర్‌  గగ్రిడ్‌, టాటా స్టీల్‌, టైటన్‌ నష్టపోతున్నాయి. ఓఎన్‌జీసీ, ఐవోసీ, హెచ్‌యూఎల్‌, ఐటీసీ లాభపడుతున్నాయి.  

మరిన్ని వార్తలు