TodayStockMarketUpdate: ఫ్లాట్‌ ముగింపు, ఆటో జోరు

24 Jan, 2023 16:35 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. గ్లోబల్‌ సానుకూల సంకేతాలు, దిగ్గజాల క్యూ3 ఫలితాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ మంగళవారం  నష్టాలనెదుర్కొంది. చివరికి నష్టాలను తగ్గించుకుని ఫ్లాట్‌గా ముగిసాయి. సెన్సెక్స్‌ 37 పాయింట్ల లాభంతో   60978 వద్ద ,  నిఫ్టీ ఫ్లాట్‌గా 18118 వద్ద ముగిసింది.

నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.2 శాతం ఎగియగా,  ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియాల్టీ నష్టపోయాయి. టాటా మోటార్స్‌, మారుతి సుజుకి, బజాజ్‌ ఆటో, హెచ్‌సీఎల్‌ టెక్‌ , బ్రిటానియా టాప్‌ విన్నర్స్‌గా నిలిచాయి. మరోవైపు యాక్సిస్‌ బ్యాంకు, డా.రెడ్డీస్‌, హిందాల్కో, పవర్‌ గ్రిడ్‌, గ్రాసిం టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.  

ఫలితాల నేపథ్యంలో ఆటోమేజర్‌ మారుతి సుజుకి లాభపడింది. టాటా  మోటార్స్‌ గురువారం  ఫలితాలను ప్రకటించనుంది. మరోవైపు బాలీవుడ్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ లేటెస్ట్‌ మూవీ పఠాన్‌ జోష్‌తో పీవీఆర్‌ షేరు భారీగా లాభపడింది. అటు డాలరు మారకంలో రూపాయి మరింత పతనమైంది. 28 పైసలు కుప్పకూలి 81.71 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు