రికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్

3 Sep, 2021 16:07 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు తమ జోరును కొనసాగిస్తున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యలో ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వంలో సూచిలు ముగింపు సమయంలో గరిష్ట స్థాయిలలో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 277.41 పాయింట్లు (0.48%) పెరిగి 58,129.95 వద్ద ఉంటే, నిఫ్టీ 89.40 పాయింట్లు (0.52%) లాభపడి 17,323.60 వద్ద ముగిశాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.01 వద్ద నిలిచింది.‎

రిలయన్స్ ఇండస్ట్రీస్, ఒఎన్‌జిసీ, కోల్ ఇండియా, ఐఒసీఎల్, టైటాన్ కంపెనీ షేర్లు నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సీ లైఫ్, సీప్లా, భారతి ఎయిర్ టెల్, హెచ్ యుఎల్ మరియు హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు టాప్ లూజర్లలో ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ మినహా, అన్ని ఇతర సెక్టోరల్ సూచీలు నిఫ్టీ ఆటో, మెటల్, ఎనర్జీ సూచీలు 1-2 శాతం లాభాలతో ముగిశాయి.(చదవండి: రూ.500కే జియో స్మార్ట్‌ ఫోన్‌ ! షరతులు వర్తిస్తాయి)

మరిన్ని వార్తలు