సరికొత్త రికార్డులతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

15 Jul, 2021 16:40 IST|Sakshi

ముంబై: ఇన్వెస్టర్లు రియాల్టీ, ఐటీ స్టాక్‌లను భారీగా కొనుగోలు చేయడంతో గురువారం సూచీలు  రికార్డు స్థాయికి చేరాయి. వరుసగా నాలుగో రోజు సూచీలు లాభాల్లో ముగిశాయి.ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి 53,159పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్‌ సరికొత్త జీవితకాలపు గరిష్ట లాభాలను నమోదుచేసింది. నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 15, 924 వద్ద నిలిచింది.  

అన్ని రంగాల షేర్లు లాభాల్లో నిలిచాయి. రియాల్టీ, ఐటీ రంగ షేర్లు రాణించగా.. ఆటో, బ్యాంకింగ్, ఫార్మా, మీడియా సూచీలు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. హెచ్‌సిఎల్ టెక్ , ఎల్ అండ్ టి, టెక్ ఎమ్, హిండాల్కో, విప్రో, యుపిఎల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్,  ఐటిసి లాభాలను గడించాయి. ఒఎన్‌జిసి  ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా , భారతి ఎయిర్‌టెల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నష్టాలను చవిచూశాయి. 
 

మరిన్ని వార్తలు