StockMarketClosing రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌ షాక్‌: వరుసగా మూడో సెషన్‌లో నష్టాలు

21 Nov, 2022 15:31 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి.  గ్లోబల్ సంకేతాలతో  సోమవారం వరుసగా మూడో సెషన్‌లో నష్టపోయిన సెన్సెక్స్‌ ఆరంభంలో సెన్సెక్స్ 460 పాయింట్లకు పైగా పడిపోయింది. ఐటీ,పవర్‌, రియాల్టీ రంగ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దీంతో రోజంతా నష్టాల్లోనే కొనసాగి,  చివరకు సెన్సెక్స్‌ 519 పాయింట్లు కుప్పకూలి , 61114 వద్ద నిఫ్టీ 148 పాయింట్ల  పనతంతో  నిఫ్టీ వద్ద 18159 వద్ద ముగిసింది. 

బీపీసీఎల్‌ , భారతి ఎయిర్టెల్‌,  యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, హెచ్‌యూఎల్‌ టాప్‌ విన్నర్స్‌గా నిలవగా, ఓఎన్జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌,  హీరో మోటాకార్ప్‌, అదానీపోర్ట్స్‌ , ఎల్‌ అండ్‌ టీ, టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలోరూపాయి 17పైసలు నష్టోయి 81.83 వద్ద ఉంది. 

మరిన్ని వార్తలు