StockMarketUpdate: లాభాల స్వీకరణ, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ డౌన్‌

25 Nov, 2022 10:01 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌ సూచీలు నష్టాలతో  మొదలయ్యాయి. రికార్డు హైల వద్ద లాభాల స్వీకరణకు తోడు థాంక్స్ గివింగ్ సందర్భంగా అమెరికా మార్కెట్లు  పనిచేయని కారణంగా పెట్టుబడిదారుల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో దాదాపు అన్ని రంగాల షేర్లు  స్తబ్లుగా ఉన్నాయి.

ముఖ్యంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెల​‍కొంది. ప్రభుత్వ రంగ షేర్లు లాభపడుతున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌,నిఫ్టీ స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 62 వేల పాయింట్లకుపైన, నిఫ్టీ 18400కు  ఎగువన ఉన్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎల్‌ అండ్‌ టీ, యాక్సిస్‌ బ్యాంకు,అపోలో హాస్పిటల్స్‌, కోల్‌ ఇండియా లాభాల్లోనూ,  బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌యూఎల్‌, సిప్లా, నెస్లే, ఆసియన్‌పెయింట్స్‌ , అదానీ ఎంటర్‌ పప్రైజెస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌,  ఐటీసీ నష్టాల్లో ఉ‍న్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి15 పైసలు ఎగిసి  81.51 వద్ద  కొనసాగుతుంది
 

మరిన్ని వార్తలు