ప్రీ బడ్జెట్‌ ఫీవర్‌ : తీవ్ర ఊగిసలాట

29 Jan, 2021 15:34 IST|Sakshi

సాక్షి, ముంబై :  పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు, రానున్న బడ్జెట్‌ మధ్య  దేశీయ సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. ట్రేడింగ్‌ ఆరంభంలోనే లాభాలతో సూచీలు ఫిబ్రవరి సిరీస్‌ను ఉత్సాహంతో ప్రారంభించాయి. 400 పాయింట్లకు పైగాఎగిసి 5 రోజుల వరుస నష్టాలకు చెక్‌  చెప్పాయి. కానీ ఆ తరువాత తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ  600 పాయింట్లకు పైగా కుప్పకూలింది. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ చివరకు సెన్సెక్స్‌ 589 పాయింట్లు పతనమై 46285 వద్ద  46 వేల 300 స్థాయి దిగువకు చేరింది. నిఫ్టీ కూడా అదే పరిస్థితి. 183 పాయింట్ల నష్టంతో 13634 వద్ద నిఫ్టీ ముగిసింది. మరోవైపు బ్యాంకింగ్‌ , ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్‌‌ షేర్లలో కొనుగోళ్ళ మద్దతు  కనిపించింది. (ఆర్థిక​ సర్వే : 11 శాతంగా జీడీపీ వృద్ధి)

టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్ ఫైనాన్స్‌ , బీపీసీఎల్‌ లాభపడగా, రిలయన్స్‌, బ్రిటానియా, మారుతీ సుజుకీ, ఐటీసీ, హీరో మోటో, ఇన్ఫోసిస్, టీసీఎస్‌, డా. రెడ్డీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ , భారతి ఎయిర్‌టెల్‌ నష్టపోయాయి. (ఫిబ్రవరి 1వ తేదీకి లోక్‌సభ వాయిదా)

మరిన్ని వార్తలు