సాక్షి మనీ మంత్రా: దలాల్‌ స్ట్రీట్‌లో రికార్డుల మోత

6 Jul, 2023 16:15 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి.బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు ఉన్నప్పటికీ కొనసాగుతున్న ర్యాలీని నిలబెట్టుకున్నాయి.  మిడ్  అండ్‌ స్మాల్-క్యాప్ సెగ్మెంట్లు బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను అధిగమించాయి, రియల్టీ, ఆయిల్ అండ్‌  గ్యాస్, పవర్  కన్జ్యూమర్‌ స్టాక్‌లు సెక్టోరియల్ ర్యాలీ   అయ్యాయి. మరోవైపు ఆటో, ఐటీ నష్టపోయాయి. 
 
సెన్సెక్స్‌ 340 పాయింట్లు ఎగిసి 65,785 వద్ద, నిఫ్టీ 99పాయింట్లు లాభంతో 19497 వద్ద స్థిరంగా ముగిసాయి. తద్వారా మరో ఆల్‌ టైం రి​కార్డ్‌ హైని నమోదు చేశాయి. ఎం అండ్‌ఎం, అపోలో  హాస్పిటల్స్‌, పవర్‌ గ్రిడ్‌, టాటా మోటార్స్‌, రిలయన్స్‌  భారీ లాభాలతో ముగియగా,  ఐషర్‌ మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతి, హెచ్‌సీఎల్  టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ నష్టపోయాయి.

(Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు )

మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి

మరిన్ని వార్తలు