సెన్సెక్స్‌ 400- నిఫ్టీ 100 పాయింట్లు అప్

1 Oct, 2020 09:35 IST|Sakshi

సెన్సెక్స్‌ 475 పాయింట్లు అప్‌- 38,543కు

నిఫ్టీ 129 పాయింట్లు జూమ్‌- 11,377 వద్ద ట్రేడింగ్‌

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం ప్లస్‌

రెండు రోజుల కన్సాలిడేషన్‌ తదుపరి దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ 400 పాయింట్లు జంప్‌చేయగా.. నిఫ్టీ లాభాల సెంచరీ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌  475 పాయింట్లు జంప్‌చేసి 38,543ను తాకగా.. నిఫ్టీ 129 పాయింట్లు ఎగసి 11,377 వద్ద ట్రేడవుతోంది. మరో భారీ సహాయక ప్యాకేజీపై అమెరికా ప్రభుత్వం చర్చలు చేపట్టిన నేపథ్యంలో బుధవారం యూఎస్‌ మార్కెట్లు 1.2-0.7 శాతం మధ్య ఎగశాయి. ఇక ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ట్రెండ్‌ నెలకొంది. దేశీయంగా అవసరమైతే మరో ప్యాకేజీని ప్రకటించేందుకు వెనుకాడబోమంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేయడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.

మీడియా జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మీడియా, బ్యాంకింగ్‌, రియల్టీ, ఐటీ, ఆటో, మెటల్‌ 3.7-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్‌, యాక్సిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫిన్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌ 3.6-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. కేవలం ఓఎన్‌జీసీ, నెస్లే, సిప్లా అదికూడా 3-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి.

పీవీఆర్‌ జూమ్
డెరివేటివ్‌ కౌంటర్లలో పీవీఆర్‌ 15 శాతం దూసుకెళ్లగా, బంధన్‌ బ్యాంక్‌, డీఎల్‌ఎఫ్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, నాల్కో, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎంజీఎల్‌, కెనరా బ్యాంక్‌ 4-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఐడియా, ఎస్కార్ట్స్‌, పీఎన్‌బీ, అపోలో హాస్పిటల్స్‌ మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో 3.2-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,167 లాభపడగా..  312 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు