స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

23 Jul, 2021 09:43 IST|Sakshi

శుక్రవారం దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. మదుపర్లు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గుచూపడం,అంతర్జాతీయ మార్కెట‍్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై చూపడంతో  సెన్సెక్స్‌ 130.66 పాయింట్ల స్వల్ప లాభాలతో  52,9067 పాయింట్లతో ట్రేడ్‌ అవుతుండగా  నిఫ్టీ 32.80 పాయింట్ల లాభంతో 15,856 వద్ద ట్రేడింగ్‌ కొనసాగుతుంది. ఇక, ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్, అంబుజా సిమెంట్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఫెడరల్ బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్, ఎస్‌ బ్యాంక్, ఆర్ట్‌సన్ ఇంజనీరింగ్ లాభాల్లో కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు