stockmarket Opening: బుల్‌ దౌడు,వెలిగిపోతున్న దలాల్‌ స్ట్రీట్

11 Aug, 2022 09:42 IST|Sakshi

59000 కు ఎగువన సెన్సెక్స్‌ 

17700 టచ్‌ చేసిన నిఫ్టీ

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మరింత పుంజుకున్న సెన్సెక్స్‌ 533 పాయింట్లు ఎగిసి 59350  వద్ద, నిఫ్టీ 143 పాయింట్ల లాభంతో 17675 వద్ద  ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కళకళ లాడుతున్నాయి. ఒకదశలో సెన్సెక్స్‌ 600 పాయింట్లు ఎగిసింది. తద్వారా 59 వేల స్థాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా 17700ని దాటింది.  రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్ర, విప్రో,టీసీఎస్‌, ఇండస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి.

జూలైలో అమెరికాలో వినియోగదారుల ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇంధన ధరల తగ్గుదల కారణంగా, జూలైలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికి భిన్నంగా  మెరుగ్గా ఉండటం అంతర్జాతీయ మార్కెట్లకు ఊతమిచ్చింది.  మార్కెట్‌ అంచనాల కంటే తక్కువగా జూలై ద్రవ్యోల్బణం  8.5 శాతంగా నమోదైంది.  జూన్‌లో ఇది 9.1 శాతంగా ఉంది. 

మరిన్ని వార్తలు