షార్ట్‌ కవరింగ్‌ : ఐదు రోజుల నష్టాలకు బ్రేక్‌ 

19 Mar, 2021 16:30 IST|Sakshi

 ఐదు రోజుల నష్టాలకు  బ్రేక్‌

వారాంతంలో లాభాలు

సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలనుంచి అనూహ‍్యంగా పుంజుకున్నాయి. అంతేకాదు వారమంతా నష్టాలతో ట్రేడ్‌ అయిన సూచీలు, వారాంతంలో పాజిటివ్‌గా  ముగియడం విశేషం.  ఇంట్రాడేలోసెన్సె‍క్స్‌  ఒక దశలో 630 పాయింట్ల వరకు పడిపోయి 49వేల దిగువకు చేరింది. నిఫ్టీ 14,400 కన్నా పడిపోయింది. 10 సంవత్సరాల యుఎస్ బాండ్ దిగుబడి 2.2 శాతం తగ్గి 1.691 శాతానికి చేరుకున్న తరువాత మధ్యాహ్నం ట్రేడింగ్లో బెంచ్ మార్కులు బలమైన రికవరీని సాధించాయి. ఫలితంగా  సెన్సెక్స్ ఏకంగా 641 పాయింట్ల లాభంతో   49858 వద్ద ముగిసింది. నిఫ్టీ  186  పాయింట్లులాభపడి 14744   వద్ద ముగిసింది. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ  స్టాక్స్‌లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి.  రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఇన్ఫోసిస్ , బజాజ్ ఫైనాన్స్‌లలో లాభాలు, అలాగే వీకెండ్‌లో ట్రేడర్ల   షార్ట్ కవరింగ్‌, కీలక  స్థాయిల వద్ద లభించిన  కొనుగోళ్ల మద్దతుతో ఐదు వరస నష్టాల సెషన్లకు బ్రేక్ పడింది.

ఎన్‌టీపీసీ, హెచ్‌యుఎల్,  పవర్ గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ  స్టీల్, యూపీఎల్‌  టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. , కోల్ఇండియా , ఎల్‌ అండ టీ, టెక్ మహీంద్రా,  బజాజ్ ఆటో, టైటన్  నష్టాల్లో ముగిసాయి.  మరోవైపు రిలయన్స్‌తో డీల్‌కు బ్రేక్‌ పడిన నేపథ్యంలో  కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల షేర్లు 10 శాతం కుప్పకూలాయి.

మరిన్ని వార్తలు