ప్రాఫిట్‌ బుకింగ్‌: లాభాలనుంచి వెనక్కి

1 Jun, 2021 16:01 IST|Sakshi

7 రోజుల నిఫ్టీ ర్యాలీకి బ్రేక్‌

52 వేల దిగువకు సెన్సెక్స్‌

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  ఫ్లాట్‌గా ముగిసాయి. లాభాలతో ప్రారంభమై రికార్డు స్థాయి నమోదు  త​ర్వాత కీలక సూచీలు స్పల్పనష్టాల్లోకి జారుకున్నాయి. ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా మిడ్‌సెషన్‌లో ఒక దేశలో 100 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్‌ చివరలో తిరిగి పుంజుకుంది.  దీంతో కేవలం 3 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌  51934వద్ద, నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 15574 వద్ద ముగిసింది.

దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే ముగిసాయి. ముఖ్యంగా మెటల్ , ఫార్మా షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, పిఎస్‌యు బ్యాంక్, రియాల్టీ, ఆటో షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.  దీంతో గత ఏడు ట్రేడింగ్ సెషన్లలోని 5 శాతం నిఫ్టీ ర్యాలీకి బ్రేక్‌లు పడ్డాయి. ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైన్సాస్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఆటో, టెక్‌ ఎం, హెచ్‌యూఎల్‌ లాభపడగా, జెఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్ , ఐసీఐసీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఆక్సిస్‌ బ్యాంకు, ఐటీసీ, కోటక్‌ మహీంద్ర, పవర్‌ గ్రిడ్‌ తదితరాలు నష్టపోయాయి.

చదవండి :  కరోనా విలయం: కోటి ఉద్యోగాలు గల్లంతు
మిషన్‌ చోక్సీ: కీలక మహిళ ఎవరంటే?

మరిన్ని వార్తలు