ప్రాఫిట్ ‌బుకింగ్ ‌: బడ్జెట్‌ ర్యాలీకి బ్రేక్‌

9 Feb, 2021 16:32 IST|Sakshi

 రికార్డు హై నుంచి పతనమై ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

లాభాల స్వీకరణ, ఆరు రోజుల లాభాలకు బ్రేక్‌

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు రికార్డు పరుగు నుంచి వెనక్కి తగ్గాయి. రికార్డుల మోత మోగించిన సూచీలు ఆఖరి గంటలో  మొత్తం లాభాలను కోల్పోయాయి. లాభాల స్వీకరణతో  రికార్డు హై నుంచి సెన్సెక్స్‌  642  పాయింట్లు పతనమైంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ  అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ , ఫార్మా షేర్లలో ప్రాఫిట్  బుకింగ్‌  కనిపించింది. చివరకు సెన్సెక్స్‌ 20పాయింట్ల నష్టంతో 51329 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 15109వద్ద స్థిరపడ్డాయి. తద్వారా  వరుస ఏడు రోజుల లాభాలకు బ్రేక్‌ చెప్పాయి.  ఇంట్రా డేలో సెన్సెక్స్ 487 పాయింట్లు పెరిగి 51,835.86 వద్ద,  నిఫ్టీ 50 ఇండెక్స్ 15,257  వద్ద  ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. 

కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ ,  రిలయన్స్‌ డీల్‌కు హైకోర్టు తన మునుపటి ఉత్తర్వులను రద్దు చేస్తూ  సానుకూల తీర్పురావడంతో  ఫ్యూచర్‌  షేర్లు 10 శాతం ఎగిసాయి.   మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ నిఫ్టీ లూజర్‌గా ఉంది.   ఇంకా టాటా మోటార్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, బజాజ్ ఆటో, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, దివిస్ ల్యాబ్స్, టీసీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా నష్టపోయాయి.  ఎస్‌బిఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఒఎన్‌జిసి, ఇండియన్ ఆయిల్, టైటాన్, శ్రీ సిమెంట్స్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి. రికార్డు స్థాయిల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణతో ఆరు రోజుల బడ్జెట్ ర్యాలీని   బ్రేక్‌ పడిందని విశ్లేషకులు తెలిపారు. 

మరిన్ని వార్తలు