షార్ట్‌ కవరింగ్‌: నష‍్టాలకు చెక్‌

22 Apr, 2021 16:24 IST|Sakshi

 ఆరంభ నష్టాలనుంచి పుంజుకున్న మార్కెట్‌

 బ్యాంకింగ్‌ జోరు, రెండు రోజుల నష్టాలకు చెక్‌

48 వేలకు ఎగువన సెన్సెక్స్‌, 14400పైన ముగిసిన నిఫ్టీ

సాక్షి, ముంబై: ఆరంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్న స్టాక్‌మార్కెట్‌  లాభాలతో ముగిసింది.   మార్కెట్‌ పతనంతో  షార్ట్‌ కవరింగ్‌  వైపు  ట్రేడర్లు మొగ్గు చూపారు. ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  యాక్సిస్ బ్యాంక్‌  షేర్లు ర్యాలీ అయ్యాయి. దీంతో కీలక  సూచీలు రెండూ ప్రధానమద్దతు స్థాయిలకు ఎగువన స్థిరపడ్డాయి.  సెన్సెక్స్‌ 375 పాయింట్లు ఎగిసి 48080 వద్ద , నిఫ్టీ 110 పాయింట్లు ఎగిసి 14406 వద్ద పటిష్టంగా ముగిసాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌ 722 పాయింట్లు పెరిగి ఇంట్రాడే గరిష్ట స్థాయి 31,834.50 వద్ద ముగిసింది. మెటల్, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్,  రియాల్టీ షేర్లు కూడా లాభపడగా,మరోవైపు, ఎఫ్‌ఎంసిజి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. విప్రో, జెఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి, భారత్ పెట్రోలియం, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో,, బజాజ్ ఫైనాన్స్ లాభపడగా,

మరిన్ని వార్తలు