stockmarket : బ్యాంకుల దెబ్బ, నష్టాల్లో సూచీలు

29 Jun, 2021 10:04 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాలతో ఓపెనింగ్‌లో నష్టపోయినా,  తరువాత కొద్దిగా పుంజుకున్నాయి. తిరిగి అమ్మకాల ఒత్తిడితో మళ్లీ కీలక సూచీలు నష్టాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 126 పాయింట్లు నష్టంతో 52607 వద్ద,నిఫ్టీ 56 పాయింట్లు కోల్పోయి 15758వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన స్థాయిలను కోల్పోయాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. బ్యాంకుల షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, ఎల్‌ అండ్‌ టీ లాభపడుతుండగా,  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు నష్టపోతున్నాయి. అటు కరెన్సీ మార్కెట్‌లో రూపాయి కూడా బలహీనంగానే ఉంది. డాలరు మారకంలో సోమవారం నాటి ముగింపు 74.19 తో పోలిస్తే 74.28 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. 

>
మరిన్ని వార్తలు