Stock Market: దలాల్ స్ట్రీట్‌లో లాభాల జోరు

29 Jul, 2022 15:30 IST|Sakshi

57500 ఎగువకు సెన్సెక్స్‌

17000 పైన ముగిసిన నిఫ్టీ

సాక్షి,ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లోముగిసాయి.సెన్సెక్స్‌ పాయింట్ల మేర ఎగిసింది.  నిఫ్టీ 17వేలకు పైన స్థిరంగా ముగిసింది. ఆరంభ లాభాల నుంచి కాస్త వెనక్కి  తగ్గినా,  ఆ తరువాత అదే స్థాయిలో ఎగిసింది .చివరికి సెన్సెక్స్‌ 712 పాయింట్లు ఎగిసి 57570 వద్ద, నిఫ్టీ 229 పాయింట్ల లాభంతో  17158 వద్ద క్లోజ్‌ అయ్యాయి.

దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. డా.రెడ్డీస్‌ టాప్‌ లూజర్‌గా నిలవగా, కోటక్‌ మహీంద్ర, ఎస్‌బీఐ, దివీస్‌ ల్యాబ్స్‌, యాక్సిస్‌ బ్యాంకు నష్ట పోయాయి. సెన్సెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్‌గా, టాటా స్టీల్  ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, ఇన్ఫోసిస్‌,రిలయన్స్‌,  లాభపడ్డాయి. మరోవైపు  ఫెడ్‌ వడ్డింపుతో డాలరు బలహీన పడింది. ఫలితంగా దేశీయ కరెన్సీ బాగా కోలుకుంది.శుక్రవారం దాదాపు మూడు వారాల గరిష్టస్థాయిని నమోదు చేసింది. గురువారం నాటి ముగింపు 79.75 పోలిస్తే రూపాయి డాలర్‌ మారకంలో  79.39వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. డాలర్‌తో పోలిస్తే చాలా ఆసియా కరెన్సీలు కూడా లాభపడటం విశేషం.

>
మరిన్ని వార్తలు