లాభాల్లో సూచీలు, 15వేలకు చేరువగా నిఫ్టీ

10 May, 2021 12:34 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌ మార్కెట్లు తిరిగి ప్రారంభమై లాభాల వైపు అడుగులు వేస్తోంది. ఆర్బీఐ లిక్విడిటి మద్దతు తెలపడంతో, కరోనా దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ లేకపోవడంతో ఈ వారం సెన్సెక్స్‌ లాభాలతో మొదలైంది. మొదట్లో సెన్సెక్స్‌ 350 పాయింట్ల వరకు ఎగబాకింది.  ప్రస్తుతం 255.34 పాయింట్లు ఎగబాకి 49,462.61 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సూచీ తొలుత 49,590.43 గరిష్టాన్ని తాకింది.  

నిఫ్టీ 117 పాయింట్లు లాభపడి 14,940 వద్ద ట్రేడ్‌ అవుతుండగా మరోసారి 15000 మార్కును తాకే అవకాశం ఉంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.31 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాలతో గడించాయి.దీంతో ఆసియా మార్కెట్లు నేడు లాభాల బాటలో పయనిస్తున్నాయి.గ్లోబల్ మార్కెట్ల సానుకూల పవనాలతో ఇండెక్స్ మేజర్‌ కంపెనీలు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

చదవండి: India GDP: భారత్‌ వృద్ధి అంచనాలు డౌన్‌..!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు