StockMarketClosing:మార్కెట్‌ ర్యాలీ, ఏప్రిల్‌ తరువాత ఫస్ట్‌ టైం

13 Sep, 2022 15:48 IST|Sakshi

18వేల 70పాయింట్ల పైన ముగిసిన నిఫ్టీ

60571 వద్ద సెన్సెక్స్‌  క్లోజ్‌

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతోముగిసాయి.మంగళవారం భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 మంగళవారం అర శాతం కంటే ఎక్కువ లాభపడ్డాయి. ఆరంభంనుంచి జోరుగా ఉన్న కీలక సూచీలు ఆద్యంతమూ అదే జోష్‌ను కంటిన్యూ చేశాయి. నిప్టీ18వేలకు ఎగువన ముగిసింది.  

సెన్సెక్స్ 456 పాయింట్లు ఎగిసి  60571 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు ఎగిసి 18070వద్ద  స్థిరపడింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత తొలిసారిగా నిఫ్టీ 18000ని రీక్లెయిమ్ చేసింది.  దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిసాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎంసిజి,మెటల్‌, బ్యాంక్‌ షేర్లు బాగా లాభపడ్డాయి.  అయితే ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్  టాప్‌గెయినర్స్‌గా నిలిచాయి.  శ్రీసిమెంట్స్‌, సిప్లా, ఐషర్‌  మోటార్స్‌, టీసీఎస్‌ నష్టపోయాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి భారీగా పుంజుకుంది. 47పైసలు ఎగిసి 79.15 వద్ద ముగిసింది. సోమవారం 79.52 వద్ద క్లోజ్‌అయిన సంగతి  విదితమే.

మరిన్ని వార్తలు