StockMarketOpening: ఐటీ షేర్ల ర్యాలీ, తగ్గేదేలే అంటున‍్న దలాల్ స్ట్రీట్‌

14 Oct, 2022 10:43 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.  శుక్రవారం  దలాల్ స్ట్రీట్‌ లాభాల పరుగందుకుంది. బలమైన అంతర్జాతీయ సంకేతాలు, ముడి చమురు ధరల సడలింపుతో  దేశీ సూచీలు తగ్గేదేలే అన్నట్టున్నాయి. నిఫ్టీ 300 పాయింట్లు ఎగిసి 17,300 స్థాయిని తాకింది. సెన్సెక్స్  1,000 పాయింట్లకు పైగా ఎగబాకి 58,267 ఎగువకు చేరింది. వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ సూచీలుతోపాటు  అన్ని రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి.ముఖ్యంగా ఐటీ మేజర్‌ ఇన్ఫీ  11 శాతం వృద్ధితో 6,021 కోట్ల రూపాయల నికర లాభాల ఫలితాల జోష్‌తో కంపెనీషేర్లు 3 శాతానికి పైగాఎగిసాయి. ఇంకా హెచ్‌సీఎల్‌, టెక్‌ ఎం, లార్సెన్‌, యూపీల్‌ కూడా భారీ లాభాల్లో ఉన్నాయి. ఒక్క సన్‌ ఫార్మ మాత్రమే నష్టపోతోంది. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 82.33 వద్ద ఉంది.  
 

మరిన్ని వార్తలు