రెండో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్!

10 Nov, 2021 16:05 IST|Sakshi

ముంబై: బేర్ దెబ్బకు రెండవ రోజు స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ప్రపంచ మార్కెట్లలో బలహీన సంకేతాలతో పాటు దిగ్గజ రంగ షేర్లలో వెల్లువెత్తిన లాభాల స్వీకరణతో ఆరంభంలోనే సూచీలు భారీగా నష్టపోయాయి. అయితే, చివర్లో కాస్త కొనుగోళ్లు జరగడంతో కోలుకున్న మార్కెట్లు.. నష్టాలను కొంతమేర తగ్గించుకోగలిగాయి. చివరకు, సెన్సెక్స్ 80.63 పాయింట్లు (0.13%) క్షీణించి 60,352.82 వద్ద ముగిస్తే, నిఫ్టీ 27.10 పాయింట్లు (0.15%) క్షీణించి 18,017.20 వద్ద ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ నేడు రూ.74.39 వద్ద ఉంది. 

ఇండస్‌ ఇండ్ బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నేడు ఎక్కువ నష్టపోగా.. యూపీఎల్, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం, బ్రిటానియా ఇండస్ట్రీస్, సన్ ఫార్మా షేర్లు భారీగా లాభపడ్డాయి. పీఎస్‌యు బ్యాంక్, రియల్టీ, మెటల్ సూచీలు 1-2 శాతం క్షీణించగా.. ఆటో, ఫార్మా, చమురు & గ్యాస్ పేర్లలో కొనుగోళ్లు కనిపించాయి.

(చదవండి: అయ్యో ఎలన్‌ మస్క్‌.. ఎంత కష్టం వచ్చే!)

>
మరిన్ని వార్తలు