స్వల్ప నష్టాల్లో సూచీలు

14 May, 2021 14:13 IST|Sakshi

దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయ్. సెన్సెక్స్ 80 పాయింట్లు కోల్పోయి 48610 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు పతనమై 14646 వద్ద కొనసాగుతున్నాయి. అన్ని  రంగాల  షేర్లు నష్టపోతున్నాయి. 

టాటా స్టీల్, ఎం అండ్ ఎం, హిండాల్కో బిఎస్‌ఇలో ఒక్కొక్కటి 2 శాతం చొప్పున నష్టపోతున్నాయి. యూపిఎల్, టిసిఎన్ఎస్ క్లాతింగ్, ప్రిన్స్ పైప్స్, ఛంబల్ ఫర్టిలైజర్స్, పాలీకేబ్ ఇండియా, వెంకీస్, కేపిఐటి టెక్నాలజీస్‌  లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రధాన చమురు వినియోగదారుల భారతదేశంలో కరోనావైరస్ కేసులు  జోరు, సైబర్ దాడి కారణంగా అమెరికాలో పైపులైన్ మూత తరువాత చమురు ధరలు రోజుకు 3 శాతం పడి పోయాయి. బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ 35 సెంట్లు లేదా 0.5 శాతం తగ్గి బ్యారెల్ 66.70 డాలర్లకు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) 28 సెంట్లు లేదా 0.4 శాతం తగ్గి బ్యారెల్ 63.54 డాలర్లకు పడిపోయింది.

మరిన్ని వార్తలు