బ్యాంకింగ్‌ షేర్లు ఢమాల్‌: మార్కెట్లకు భారీ నష్టాలు

13 Jul, 2022 16:03 IST|Sakshi

16  వేల దిగువకు నిఫ్టీ

54 వేల స్థాయిని కోల్పోయిన సెన్సెక్స్‌

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో 300 పాయింట్లకు పైగా ఎగిసిన  సెన్సెక్స్‌ చివరికి 372 పాయింట్లు పతనమై 53514 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 92  పాయింట్లు నష్టపోయి 15966 వద్ద స్థిరపడింది. దాదాపు అన్నిరంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి.  ఫలితంగా వరుసగా మూడవ సెషన్‌లో బుధవారం కూడా  నష్టపోయాయి. బ్యారెల్‌కు క్రూ డ్ ధరలు 100  డాలర్లకు పైకి చేరడంతో మార్కెట్లను ప్రభావితం చేసింది.

ముఖ్యంగా  బ్యాంకింగ్‌ షేర్లు ఎక్కువగా నష్టపోగా, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. దివీస్‌ ల్యాబ్స్‌, జేఎస్‌డబ్ల్యూ  స్టీల్‌, హెచ్‌యూఎల్‌, సిప్లా, ఏషియన్‌ పెయింట్స్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి.  మరోవైపు ఇండస్‌ ఇండ్‌, భారతి ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌, రిలయన్స్‌, కోల్‌ ఇండియా, టిసిఎస్, టైటాన్, హెచ్‌సిఎల్ టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. ఇక దేశీయ కరెన్సీ రూపాయి పతనం బుధవారం కూడా కొనసాగింది. డాలరు మారకంలో రూపాయి  79.64 వద్ద రికార్డు క్లోజింగ్‌ను నమోదు చేసింది. 

మరిన్ని వార్తలు