కొనుగోళ్ల మద‍్దతు : మార్కెట్లు  జంప్‌ 

11 Feb, 2021 10:03 IST|Sakshi

కొనసాగుతున్న ఒడిదుడుకుల ధోరణి

ఫ్లాట్‌నుంచి లాభాల్లోకి మళ్లిన మార్కెట్‌

సాక్షి,ముంబై:  స్టాక్‌మార్కెట్లో ఒడిదుడుకుల ధోరణి కొనసాగుతోంది. ఆరంభంలో ఫ్లాట్‌గా  ఉన్న సూచీలు  క్రమంగా లాభాల్లోకి మళ్లాయి.  సెన్సెక్స్‌ ప్రస్తుతం 190 పాయింట్లు ఎగిసి 51500 వద్ద, నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 15162 వద్ద  కొనసాగుతున్నాయి.  దాదాపు అన్ని రంగాల  షేర్లలో కనిష్ట స్థాయిల్లో కొనుగళ్ల ధోరణి కనిపిస్తోంది.  బ్యాంకింగ్‌,  మెటల్స్‌ షేర్లకు భారీ కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. వీక్లీ డెరివేటివ్స్‌ ముగియనున్న తీవ్ర ఒడిదుడుకులుంటాయని అప్రమత్తంగా ఉండాలని మార్కెట్‌ పండితులు సూచిస్తున్నారు.  కీలక మద్దతు స్థాయిలను గమనించాలంటున్నారు.

ఐషర్‌ మోటార్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, హిందాల్కోలు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. హిందాల్కో,  గెయిల్‌ , టాటా స్టీల్‌, అదాని పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ లాభపడుతుండగా, ఐషర్‌ మోటార్స్‌ ఎన్టీపీసీ  టైటాన్‌, హీరోమోటోకార్ప్‌, విప్రో  నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఐటీసీ,  కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎసిసి, అశోక్ లేలాండ్, అతుల్ ఆటో, బజాజ్ హిందుస్థాన్ షుగర్, బేయర్ క్రాప్‌సైన్స్, బాష్, కెపాసిట్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్, క్రిసిల్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గుజరాత్ పిపావావ్ పోర్ట్, గ్రాఫైట్ ఇండియా, ఎంఆర్ఎఫ్, నాట్కో ఫార్మా, ఎన్‌సిసి, ఎన్‌హెచ్‌పిసి, ఆయిల్ ఇండియా, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ తదితరాలు ఈ రోజు  త్రైమాసిక ఆదాయాలను ప్రకటించనున్నాయి.

మరిన్ని వార్తలు