StockMarketClosing: భారీ లాభాలు, 58 వేల ఎగువకు సెన్సెక్స్‌

17 Oct, 2022 15:40 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంలో నష్టాలతో నిరాశపర్చినా వెంటనే  తేరుకుని లాభాల్లోకి మళ్లాయి.  ఇక అక్కడనుంచి వెనుతిరిగి చూసింది లేదు.  చివరికి సెన్సెక్స్‌ 491 పాయింట్లు  ఎగిసి 58410 వద్ద, నిఫ్టీ 126  పాయింట్ల లాభంతో 17311 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా సెన్సెక్స్‌ తిరిగి 58 వేల స్థాయిని, నిఫ్టీ 17300 మార్క్‌ను నిలబెట్టుకోవడం విశేషం.  గ్లోబల్‌  మార్కెట్ల  ప్రతికూల సంకేతాలున్నప్పటికీ, కార్పొరేట్‌  కంపెనీ ఫలితాలపై ఇన్వెస్టర్ల కన్ను, కొనుగోళ్లకు దారి తీసింది. 

 ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిసాయి.  ముఖ్యంగా బ్యాంకింగ్‌  రంగ షేర్లు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సి​, ఇండస్‌ ఇండ్‌, బజాజ్‌ ఆటో, మారుతి, రిలయన్స్‌, కోటక్‌ మహీంద్ర, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభపడ్డాయి.   హిందాల్కో, లార్సెన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌,హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో నష్టపోయాయి. 

మరిన్ని వార్తలు