Stockmarket Opening: జోరుగా, సెన్సెక్స్‌ 500 పాయింట్లు అప్‌

30 Aug, 2022 13:49 IST|Sakshi

సాక్షి,ముంబై: ఆరంభంలోనే ఉత్సాహంగా ఉన్నస్టాక్‌మార్కెట్‌ అదేజోరును కంటిన్యూ  చేస్తోంది. సెన్సెక్స్‌ ఏకంగా 1211 పాయింట్లు 59184 స్థాయికి ఎగియగా,నిఫ్టీ 351 పాయింట్లు జంప్‌ చేసి 17664 వద్ద కొనసాగుతున్నాయి.  ఐటీ, బ్యాంకింగ్‌, రియల్టీ, మెటల్‌ ఇలా అన్ని రంగాల షేర్లులాభాలతోకళకళలాడుతున్నాయి. 

ఉదయం 10 గంటలు: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సోమవారం నాటి పతనం నుంచి కోలుకున్న సెన్సెక్స్ 494 పాయింట్లు ఎగిసి 58468 వద్ద,  నిఫ్టీ 154 పాయింట్లు లాభంతో 17,467 వద్ద పటిష్టగా ట్రేడ్‌ అయ్యాయి. 

దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోకొనసాగుతున్నాయి. ప్రధానంగా  మెటల్స్ 1.3 శాతం బ్యాంక్ ఇండెక్స్ 1.2 శాతం లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ట్విన్స్,  అదానీ గ్రూపు షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.  ఇంకా ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, శ్రీ సీమెంట్‌, ఓఎన్జీసీ మారుతీ, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ లాభపడుతున్నాయి.  మరోవైపు భారతి ఎయిర్‌టెల్‌, డా.రెడ్డీస్‌ మాత్రమే నష్టపోతున్నాయి. అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 16 పైసలుకోలుకుని 79.83 వద్ద ఉంది. 

మరిన్ని వార్తలు